బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 06:40:17

ఏప్రిల్‌ 29 నుంచి అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు

ఏప్రిల్‌ 29 నుంచి అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు

హైదరాబాద్ : డా.బీఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 29నుంచి ప్రారంభం కానున్నాయని వర్సిటీ అధికారులు తెలిపారు. డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌ 29నుంచి 4వ తేదీ వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మే 6 నుంచి 11వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు మే 13 నుంచి 16 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మార్చి 29వ తేదీ లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలను యూనివర్సిటీ వెబ్‌పోర్టల్‌తో పాటు సంబంధిత అధ్యయన కేంద్రంలో సంప్రదించాల్సిందిగా పేర్కొన్నారు. 


logo