ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 00:45:11

అంబేద్కర్‌ గొప్ప ఆర్థికవేత్త

అంబేద్కర్‌ గొప్ప ఆర్థికవేత్త

  • రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

బోయినపల్లి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గొప్ప ఆర్థికవేత్త అని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ కొనియాడారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లిలో బుధవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. దళిత, గిరిజన, బీసీలందరూ  ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎలా అభివృద్ధి చెందాలో రాజ్యాంగంలో అంబేద్కర్‌ వివరించారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల నిరుద్యోగ యువత వృత్తి విద్య, స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌-3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. 


logo