మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 11, 2020 , 01:44:42

వార్షిక వేతనం 27 లక్షలు!

వార్షిక వేతనం 27 లక్షలు!
  • ఇద్దరు విద్యార్థినులకు అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌

పేట్‌బషీరాబాద్‌: ఇద్దరు ఇం జినీరింగ్‌ విద్యార్థినులకు అమెజాన్‌ ఇండియా బం పర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ. 27 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు ఇచ్చింది. మంగళవా రం ఆఫర్‌ లెటర్లను కూడా పంపించింది. మేడ్చల్‌ జిల్లా దూలపల్లిలోని సెయింట్‌ మార్టిన్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ నాలుగో సంవత్సరం చదువుతున్న మధురిమ, శిరీష ఈ ఆఫర్‌ కొట్టేశారు. కళాశాలలో ఇటీవల జరిగిన ఇంటర్వ్యూల్లో వీరికి ప్లేస్‌మెంట్స్‌ లభించాయి. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంతోష్‌కుమార్‌ పాత్ర విద్యార్థినులకు నియామక పత్రాలు అందజేశారు. చైర్మన్‌ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌యాదవ్‌ విద్యార్థినులను అభినందించారు. 


logo
>>>>>>