శనివారం 30 మే 2020
Telangana - May 02, 2020 , 18:13:57

షూటింగ్‌లకు అనుమతి ఇవ్వండి

షూటింగ్‌లకు అనుమతి ఇవ్వండి

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇండ్లలోనే ఉంటున్నారని వారికి వినోదాన్ని పంచేందుగాను షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వాల్సిందిగా పలు ఛానళ్ల ప్రతినిధులు శనివారం రాష్ట్ర సినిమాటోగ్రఫిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కోరారు. నగరంలోని మాసాబ్‌ ట్యాంక్‌లో గల పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో వీరంతా మంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్, ఈ టీవీ సీఈఓ బాపినీడు, జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్, జెమిని టీవీ బిజినెస్ హెడ్ కే,సుబ్రహ్మణ్యం, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ లు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ... అతి తక్కువ సంఖ్యలో సిబ్బందిని వినియోగిస్తూ షూటింగ్‌లు నిర్వహిస్తామన్నారు. స్పందించిన మంత్రి ఈ నెల 5వ తేదీన సీఎం అధ్యక్షతన జరిగే క్యాబినెట్‌ సమావేశం అనంతరం ఈ అంశంపై పరిశీలిస్తామని తెలిపారు.


logo