బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 16:33:29

ప్రతీ పేదవాడి సొంతింటి కలను నేరవేర్చుతాం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

ప్రతీ పేదవాడి సొంతింటి కలను నేరవేర్చుతాం : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

మహబూబ్‌నగర్‌ : ప్రతీ పేదవాడి సొంతింటి కలను నేరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొండూర్గ్‌ మండలం వీరన్నపేటలో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లాటరీ ద్వారా లబ్దిదారుల ఎంపిక కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, కలెక్టర్‌ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ..

వీరన్నపేటలో 650 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించినట్లు తెలిపారు. ఈ నెల 13న మంత్రి కేటీఆర్‌ మహబూబ్‌నగర్‌ పర్యటన సందర్భంగా ఈ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభిస్తారని తెలిపారు. వీరన్నపేట్‌లో ఇళ్లు లేని 100 మంది ఎస్సీలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. డబుల్‌ బెడ్‌రూంలకు సంబంధించి దళారులను నమ్మొద్దని పేర్కొన్నారు.

logo