మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 19:36:42

క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ చెక్కు‌లను పంపిణీ చేసిన మంత్రి అల్లోల‌

క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ చెక్కు‌లను పంపిణీ చేసిన మంత్రి అల్లోల‌

నిర్మల్ : జిల్లాలోని లక్ష్మణ చందా మండలానికి చెందిన 167 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను  మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పంపిణీ చేశారు. ఆదివారం మండలంలోని వడ్యల్ గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. 

పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీయం కేసీఆర్ కల్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్  ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారని అన్నారు.  కార్యక్రమంలో ఎక్స్ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మండల ఇంచార్జి సురేందర్ రెడ్డి, మండల కన్వీనర్ రఘు నందన్ రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మి, నాయకులు అడ్వాల రమేష్, సల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


logo