ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 00:56:39

శ్మశానవాటికకు పదెకరాలు కేటాయింపు

శ్మశానవాటికకు పదెకరాలు కేటాయింపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బాలాపూర్‌ పహాడీషరీఫ్‌ వద్ద ముస్లింల శ్మశానవాటిక కోసం పదెకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ మహ్మద్‌ సలీం చెప్పారు. సోమవారం నాంపల్లిలోని వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తాను స్థలాన్ని పరిశీలించిన మరుసటిరోజే కొందరు అనధికారిక వ్యక్తులు ఆ ప్రాంతాన్ని సందర్శించి తనపై విమర్శలు చేశారని పేర్కొన్నారు. పహడీషరీఫ్‌ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నవారిపై, తనను దూషించినవారిపై బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు నిరంతరం కృషిచేస్తానని చెప్పారు.


logo