బుధవారం 03 జూన్ 2020
Telangana - May 06, 2020 , 22:17:00

ఖమ్మంలో లాటరీ పద్దతిలో దుకాణాల కేటాయింపు

ఖమ్మంలో లాటరీ పద్దతిలో దుకాణాల కేటాయింపు

ఖమ్మం : ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకుండా క్రయవిక్రయాలు సక్రమంగా నిర్వహించేందుకు లాటరీ పద్దతిలో దుకాణాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం నుంచి ఈ చర్యలను పకడ్బందీగా చేపట్టనున్నట్లు వివరించారు. భౌతిక దూరమే ప్రామానికంగా అన్ని దుకాణాలను తెరిచేందుకు అధికారికంగా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతించిన 50శాతం దుకాణాలను తెరిచేందుకు పూనుకున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం దుకాణాల్లో విక్రయాలకు అనుమతిస్తామన్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో 50శాతం మాత్రమే తెరిచే విధంగా చూస్తామన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయలు యథాతదంగా పనిచేస్తాయని చెప్పారు. ప్రధానంగా రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ, ఆర్‌టీఏ కార్యాలయాల సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. 


logo