శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 00:31:31

మొక్కలునాటిన అల్లీపురం

మొక్కలునాటిన అల్లీపురం

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి ఆదివారం తన స్వగ్రామం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్న చింతకుంట మండలం అల్లీపురంలోని గార్లగట్టుపై మొక్కలు నాటి విత్తన బంతులను విసిరారు. అనంతరం నిఖత్‌జరీన్‌ (బాక్సర్‌), ఈషాసింగ్‌ (షూటర్‌), మిథాలీరాజ్‌ (క్రికెటర్‌)లను నామినేట్‌చేశారు. మహబూబాబాద్‌ శాసనసభ్యులు బానోతు శంకర్‌నాయక్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ భవనంలో మొక్కలు నాటారు.


logo