సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 01:07:59

అమరుల త్యాగం వృథా కాలేదు

అమరుల త్యాగం వృథా కాలేదు

  • ఆవిర్భావ వేడుకల్లో మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆరేండ్లలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అమరుల త్యాగం వృథా కాలేదని చెప్పడానికి కాళేశ్వరం నిలువెత్తు సాక్ష్యమన్నారు.  కరోనా నేపథ్యంలో వైద్యులు, పోలీసులతోపాటు జర్నలిస్టులు కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారని, వారికి రూ.20 లక్షలకు తగ్గకుండా బీమా కల్పించాలని కోరారు. లాయర్లకు ఇచ్చినట్టే  రూ.25 కోట్లు ప్రకటిస్తే ఒక్కొక్కరికి రూ.10 వేలు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ ఉపాధ్యక్షుడు రమేశ్‌ హజారి, ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్‌, తెమ్జూ అధ్యక్షుడు సయ్యద్‌ ఇస్మాయిల్‌, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్‌, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్‌ బాబు, హైదరాబాద్‌ అధ్యక్షుడు యోగానంద్‌, ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.


logo