బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 18:36:53

ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరందించాలి

ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరందించాలి

హైదరాబాద్:  జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరందించాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరందించేందుకు వెంటనే చర్యలు తీసుకోల్సిందిగా సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్‌కు సూచించారు. సచివాలయంలో బుధవారం మంత్రి తన నియోజకవర్గంలో సాగునీటి శాఖ చేపట్టాల్సిన వివిధ పనుల గురించి రజత్ కుమారత్ సవివరంగా చర్చించారు.

తుంగబంధం మాటు, అంబారీపేట కాలువ విస్తరణ పనులు సత్వరమే చేపట్టాలని మంత్రి కోరారు. అలాగే మేడారం కుడి కాలువను పూర్తి చేయడం ద్వారా బొట్ల వనపర్తి, శాయంపేట, ముంజంపల్లి, మారేడుపల్లి, ఉండెడ, వేంనూర్, గూడూరు తదితర గ్రామాలలోని బీడు భూములకు నీరందుతుందన్నారు. భూగర్భ జలాల మట్టం మరింత పెరుగుతుందని, దీంతో రైతులు, ప్రజల సాగునీటి కష్టాలు తీరుతాయని వివరించారు. వీలైనంత తొందరగా పనులు చేపట్టి పూర్తి చేస్తామని మంత్రికి రజత్ కుమార్ హామీనిచ్చారు.


logo