సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 17:09:20

కొవిడ్ నివార‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాలి : ‌కేంద్రం

కొవిడ్ నివార‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాలి : ‌కేంద్రం

హైద‌రాబాద్ : కరోనా వైర‌స్‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు విస్తృతంగా ప్ర‌చారం చేప‌ట్టి, ప్ర‌జ‌ల్లో మార్పు తీసుకురావాల‌ని కేంద్ర కేబినెట్ కార్య‌ద‌ర్శి రాజీవ్ గౌబా ఆయా రాష్ర్టాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు సూచించారు. కొవిడ్ -19 నివార‌ణ చ‌ర్య‌ల‌పై రాజీవ్ గౌబా.. రాష్ర్టాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ కాన్ఫ‌రెన్స్‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ పాల్గొని కొవిడ్ నివార‌ణ‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లను వివ‌రించారు.  


ఈ సంద‌ర్భంగా రాజీవ్ గౌబా మాట్లాడుతూ.. ఆర్ధిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభం కావడంతో పాటు పండుగ సీజన్, శీతాకాలం వస్తున్నందున కోవిడ్ వ్యాధి నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాన కార్యదర్శులను కోరారు. జన సమూహాలు లేకుండా చూడాలన్నారు. ప్రజలలో టెస్టింగ్ పట్ల ఉన్న భయాందోళనలు తొలగించి ఎక్కువ మంది కోవిడ్ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తి గత పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. 


logo