ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 15:43:53

రేపటి హరితహారానికి అంతా సిద్ధం : మేయర్‌ బొంతు రామ్మోహన్‌

రేపటి హరితహారానికి అంతా సిద్ధం : మేయర్‌ బొంతు రామ్మోహన్‌

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ పరిధిలో రేపు చేపట్టే ఆరవ విడత హరితహారం కార్యక్రమానికి అంతా సిద్ధంగా ఉన్నట్లు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని విజయ నర్సరీని మేయర్‌ నేడు సందర్శించారు. ఇటువంటి 29 నర్సరీలు 50 లక్షల మొక్కలతో సిద్ధంగా ఉన్నట్లు మేయర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హరితహారం కార్యక్రమంలో ప్రజలు విరివిగా పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 

ప్రతి వార్డులో ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా మొక్కలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఎండీఏ, ఇతర ప్రైవేట్‌ నర్సరీల నుంచి జీహెచ్‌ఎంసీ మొక్కలు కొనుగోలు చేస్తోందన్నారు. హైదరాబాద్‌లో గ్రీనరీ పెంపొందించాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.


logo