శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 18:35:21

గ్రేట‌ర్ వార్‌..స‌ర్వం సిద్ధం

గ్రేట‌ర్ వార్‌..స‌ర్వం సిద్ధం

హైద‌రాబాద్‌: జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. రేపు ఉద‌యం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు జ‌రిగే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  మొత్తం 150 వార్డుల్లో 74.44 ల‌క్ష‌ల ఓట‌ర్లు ఉండ‌గా..1,122 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. టీఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో ఓటరు స్లిపులు డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటు పోలింగ్‌ కేంద్రం లొకేషన్‌ను సైతం తెలుసుకోవచ్చు.  మొబైల్‌యాప్‌లో, మైజీహెచ్‌ఎంసీ యాప్‌లో పోలింగ్‌ స్టేషన్‌ లొకేషన్‌ను తెలుసుకునే వెసులుబాటు ఉంది. 2,272 కేంద్రాలను లైవ్‌ వెబ్‌ క్యాస్టింగ్‌తో పర్యవేక్షిస్తారు. 

గ్రేట‌ర్‌లోని   సున్నిత‌, స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల‌పై పోలీసులు ప‌టిష్ఠ‌బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. పాత బ‌స్తీ ప‌రిధిలోనే ఎక్కువ‌గా స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ కేంద్రాల‌ను గుర్తించారు. ఎన్నిక‌ల్లో శాంతి భ‌ద్ర‌త‌ల నిర్వ‌హ‌ణ కోసం 52,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబ‌స్తు ఏర్పాటు చేస్తున్నారు. 

ఉప్పల్‌, బార్కస్‌, నవాబ్‌సాహెబ్‌కుంట, టోలిచౌకి, జీడిమెట్ల ఈ ఐదు డివిజన్లలో కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి 150 మంది, బీజేపీ నుంచి 149, కాంగ్రెస్‌ నుంచి 146, టీడీపీ నుంచి 106, ఎంఐఎం నుంచి 51, సీపీఐ నుంచి 17, సీపీఎం నుంచి 12 మంది వీరితో పాటు 415 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

మొత్తం ఓటర్లు: 74,44,260

పురుషులు: 38,77,688

స్త్రీలు: 35,65,896

ఇతరులు: 676

మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధిక ఓటర్లు: 79,579

రాంచంద్రాపురంలో అత్యల్ప ఓటర్లు: 27,948

పోటీలో ఉన్న అభ్యర్థులు: 1,122

జంగమ్మెట్‌లో అత్యధికంగా పోటీలో: 20 మంది

మొత్తం పోలింగ్‌ కేంద్రాలు: 9,101 

సున్నితమైనవి: 2,336 

అతి సున్నితమైనవి: 1,207

క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్లు: 279

కౌంటింగ్ హాళ్లు: 158

కౌంటింగ్ కేంద్రాలు: 150

డీఆర్‌సీ కేంద్రాలు: 30

బ్యాలెట్ బాక్సులు: 28,686
సాధార‌ణ ప‌రిశీల‌కులు: 12
వ్యయ ప‌రిశీల‌కులు: 30
ఫ్ల‌యింగ్ స్వ్కాడ్‌: 60
జోన‌ల్/ రూట్ ఆఫీస‌ర్లు: 661


logo