గురువారం 09 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 12:31:19

సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పునరంకితం : సీఎం కేసీఆర్‌

సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పునరంకితం : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రయాణం అనుకున్నరీతిలో ఎంతో ఆశావహంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పునరంకితమవుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో జాతీయజెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి రైతుల పరిస్థితి, వ్యవసాయం దారుణంగా ఉండేదన్నారు. నేడు తెలంగాణలో వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. ఎండాకాలం వస్తే ప్రజలు మంచినీళ్ల కోసం గోస పడేవారన్నారు. అదే నేడు మిషన్‌ భగీరథతో నీటి సమస్య తీరిందన్నారు. విద్యుత్‌, సాగునీరు, విద్య, వైద్య, పారిశ్రామిక, ఐటీ తదితర రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ అమరవీరులకు నివాళులు అర్పించారు. గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద సీఎం పుష్పాంజలి సమర్పించి ఘన నివాళులర్పించారు.


logo