శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 12:33:21

కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలి : మంత్రి హరీశ్‌రావు

కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలి : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : కరోనా కట్టడికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలంతా సహకరించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ములుగు మండలం వంటిమామిడి సమీపంలోని ఆర్వీఏం మెడికల్ కళాశాలలో 100 పడకల సామర్థ్యం గల కొవిడ్-19 కరోనా ట్రీట్మెంట్ బ్లాకు వార్డు, ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు. ఆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా  విషయంలో  భయం, నిర్లక్ష్యం రెండూ వద్దు. వ్యాధి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ దవాఖానకి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.


అత్యవరమైతే తప్ప అడుగు బయట పెట్టొద్దని సూచించారు. సామూహిక కార్యక్రమాలను నిర్వహించ వద్దు. కొవిడ్ మహమ్మారి పై ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు,పోలీస్ లకు సముచిత గౌరవం ఇవ్వాలన్నారు. త్వరలో ఆర్వీఎం దవాఖాన, సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో టెస్టింగ్ సెంటర్ లో ఒకే రోజు 600 మందికి పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

మంత్రి వెంట మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, వైద్యాధికారి కాశీనాథ్, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.


logo