శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Oct 03, 2020 , 07:54:40

నేడు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం

నేడు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ కార్యాలయంలో శనివారం అఖిలపక్ష సమావేశం జరుగనుంది. హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి లోకేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించనన్నారు. ఇప్పటికే ఆయన అన్నిపార్టీలకు ఈ మేరకు లేఖలు పంపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌, వార్డుల విభజన, ఓటర్ల జాబితా తదితర అంశాలపై ఆయా పార్టీలతో చర్చించనున్నారు. పార్టీల సూచనలు, అభ్యంతరాలు తీసుకోనున్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇక.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధునాతన టెక్నాలజీని వినియోగిస్తామ‌ని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఓటర్ జాబితాతోపాటు, పోలింగ్ కేంద్రాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని నిర్ణయించారు. నామినేషన్ నుంచి ఫలితాల వరకు మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామ‌ని చెప్పారు. తక్కువ సమయంలో.. తక్కువ సిబ్బందితో ఎన్నికల నిర్వహించాలని భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo