శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 14:48:57

మా ప్రార్థ‌న‌ల‌న్నీ మీతోనే ఉన్నాయి బావా : క‌విత‌

మా ప్రార్థ‌న‌ల‌న్నీ మీతోనే ఉన్నాయి బావా : క‌విత‌

హైద‌రాబాద్ : రాష్ర్ట ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు కోవిడ్‌-19 భారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌జేశారు. ఇటీవ‌ల త‌న‌తో స‌న్నిహితంగా మెలిగిన‌వారంతా ఐసోలేష‌న్‌లో ఉండాల్సిందిగా తెలిపారు. అదేవిధంగా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందిగా సూచించారు. అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు హ‌రీశ్‌రావు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్ర‌మంలో భాగంగా మాజీ ఎంపీ క‌విత ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ... మా ప్రార్థ‌న‌ల‌న్నీ మీతోనే ఉన్నాయి బావా అని పేర్కొన్నారు. తిరుగులేని మీ సంక‌ల్ప‌శ‌క్తితో క‌రోనా వైర‌స్‌ను ఓడించి అతిత్వ‌ర‌లోనే కోలుకుంటార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.


logo