మాదిగలంతా టీఆర్ఎస్ వైపే: పిడమర్తి

ఖైరతాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాదిగలంతా టీఆర్ఎస్కే పట్టం కట్టాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ అధ్యక్షుడు పిడమర్తి రవి కోరారు. దేశవ్యాప్తంగా దళితులపై జరిగిన దాడుల వెనుక బీజేపీ ప్రభుత్వ హస్తం ఉన్నదని, నేడు తెలంగాణలో పాగా వేయాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేస్తే రాష్ట్రంలోని ముస్లింలపై, క్రైస్తవులపై, దళితులపై, గిరిజనులపై దాడులు జరుగుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మాదిగ జేఏసీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులకు చేసిందేమీ లేదని, మత విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నదని మండిపడ్డారు. బీజేపీ నాయకులకు వరదలు వచ్చినప్పుడు గుర్తుకురాని హైదరాబాద్.. ఎన్నికలు అనగానే ఎగేసుకొని వచ్చారని దుయ్యబట్టారు. వర్గీకరణ విషయంలోనూ తీవ్ర అన్యాయం చేసిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి నాలుగేండ్లయినా ఆ ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. 2014లో అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని, ఆరేండ్లు గడుస్తున్నా ఉలుకూపలుకూ లేదని అన్నారు. టీఆర్ఎస్కు గ్రేటర్ ఎన్నికల్లో సంపూర్ణంగా మద్దతునిస్తున్నామని ప్రకటించారు. సమావేశంలో అంబేద్కర్ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు రాపోలు రాములు, మైస ఉపేందర్, గడ్డ యాదన్న, ముత్యపాగ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పీఆర్సీ నివేదిక పూర్తి పాఠం
- రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు
- పట్టుకోలేరనుకున్నాడు..
- ఫ్లాట్లన్నీ విక్రయించాక.. అదనపు అంతస్థు ఎలా నిర్మిస్తారు
- రూ.15 వేల కోసం ప్రాణం తీశారు
- వెలుగులు పంచుతున్న గుట్టలు
- ప్రాథమ్యాలు గుర్తెరిగి పనిచేయండి
- ప్రయాణికులకు డబుల్ ఖుషీ
- 28-01-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
- దేశ సంస్కృతిని చాటిచెప్పేలా..