ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 21:35:17

వరంగల్‌లోనే కరోనా బాధితులకు అన్ని వసతులు : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌లోనే కరోనా బాధితులకు అన్ని వసతులు : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌: కరోనా వచ్చిందనో, వస్తుందనో వరంగల్‌ ప్రజలు ఆగం కావొద్దు.ఆందోళన చెందొద్దు. కరోనా నియంత్రణకు కావాల్సిన సౌకర్యాలు, చికిత్సలు వరంగల్‌లోనే చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాబివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. వరంగల్‌లోని  క్యాంపు కార్యాలయంలో  ఎంజీఎం వైద్యశాలలో కరోనా బెడ్లు, వైద్య సామార్ధ్యం పెంపు తదితర అంశాలపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 

ప్రధాన మంత్రి స్వాస్త్య సంయోజన పథకం కింద వరంగల్‌ సెంట్రల్‌ జైలు ఆవరణలో నిర్మించిన 200 పడకల వైద్యశాలని పూర్తిగా కోవిడ్‌ ఆస్పత్రిగా వినియోగించుకోవాలని నిర్ణయించామని వెల్లడించారు. అందుకు తగిన ఏర్పాట్లు  చేయనున్నామని వివరించారు. మరోవైపు అనేక రకాల రోగులు వచ్చే ఎంజీఎంను మాత్రం సాధారణ వైద్యశాలగానే పరిగణిస్తామని తెలిపారు.సాధారణ కరోనా రోగులకు ఐసోలేషన్‌ వార్డుగా కాకతీయ యూనివర్సిటీనీ వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. చికిత్సలు అందించే వైద్యుల కోసం హోటల్‌ హరితను వినియోగించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 

ఎంజీఎం ఆస్పత్రికి కావల్సిన రాపిడ్‌ టెస్టుల కిట్లు, వెంటిలేటర్లు ,ఆక్సిజన్‌, పీపీఈ కిట్లను ఇవ్వనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారని ఆయన అన్నారు. హోం క్వారంటైన్‌లో చికిత్స పొందే వారికి ఫోన్‌ ద్వారా వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబర్లు ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వెల్లడించారు.  కరోనా వైద్య సేవలు అందించే ఉత్తమ డాక్టర్లకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని తెలిపారు. వైద్యులకు ప్రతి రోజూ రూ.వెయ్యి,నర్సులకు రూ.500, మిగతా సిబ్బందికి రూ.300 ఇవ్వనున్నామని వెల్లడించారు.  ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ భాస్కర్‌, ఎంపీ బండా ప్రకాశ్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యేలు నన్పపనేని నరేందర్‌, చ ల్లాధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్‌, వరవంగ్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌, సీపీ తదితరులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo