శనివారం 30 మే 2020
Telangana - May 19, 2020 , 19:48:56

జూలైలో ప్రవేశపరీక్షలు ?

జూలైలో ప్రవేశపరీక్షలు ?

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడీ తదితర కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్షలను జూలైలో నిర్వహించాలని ఉన్నతవిద్యామండలి భావిస్తున్నది. పదోతరగతి పరీక్షలు జూన్‌లో, దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ పరీక్షలు జూలైలో జరుగనున్నాయి. భారీసంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షల కంటే తక్కువమంది రాసే సెట్లను నిర్వహించటం తేలిక. అందునా వీటిలో ఎక్కువగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టులే ఉన్నాయి. దాంతో యూనివర్సిటీల అధికారులతో చర్చించి, ప్రభుత్వ అనుమతితో ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం అనుమతిస్తే జూలైలోనే డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు కూడా నిర్వహించాలని యూనివర్సిటీలు భావిస్తున్నాయి. అన్నిరకాల పరీక్షల హాల్‌టికెట్లపై కొవిడ్‌-19 వ్యాప్తిచెందకుండా పాటించాల్సిన నిబంధనలు ముద్రించాలని నిర్ణయించారు.


logo