సోమవారం 01 జూన్ 2020
Telangana - May 23, 2020 , 02:03:34

జూలైలోనే అన్ని ప్రవేశ పరీక్షలు?

జూలైలోనే అన్ని ప్రవేశ పరీక్షలు?

  • ఎంసెట్‌ జూలై 6 తర్వాత!
  • నేడు నిర్ణయించనున్న ప్రభుత్వం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో వాయిదా పడిన వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలను జూలైలో నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, ఇతర అధికారులు భేటీ కానున్నారు. పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఉన్నత విద్యామండలి రెండు రకాల తేదీలతో ప్రతిపాదనలను విద్యాశాఖ మంత్రి ముందుంచనున్నది. ఈ తేదీలపై సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ తేదీల ప్రకారం ఎంసెట్‌ను జూలై 6న ప్రారంభించేలా ప్రతిపాదనలను తయారుచేశారు. ఈసెట్‌ను జూలై 4, లాసెట్‌ 10, ఎడ్‌ సెట్‌ 13, ఐసెట్‌ 14, పీజీఈసెట్‌ జూలై 27వ తేదీన  నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ప్రవేశపరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.  


logo