గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 07:18:36

సెట్‌ దరఖాస్తులకు 20 వరకు గడువు

సెట్‌ దరఖాస్తులకు 20 వరకు గడువు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్నిరకాల ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. కరోనా నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి బుధవారం వెల్లడించారు. మరోవైపు, మే 4 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న ఎంసెట్‌- 2020, మే 2న నిర్వహించనున్న ఈసెట్‌ను- 2020ని వాయిదా వేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కరోనా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సంబంధిత అధికారులు చెప్తున్నారు.


logo