దురాజ్‌పల్లి జాతరకు అన్నిఏర్పాట్లు చేయాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట : తెలంగాణ రెండేళ్లకోసారి ఘనంగా జరిగే దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతరకు అన్నిఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరగనున్న జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కరోనా నేపథ్యంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. గత అనుభవనాలను, పొరపాట్లను శాఖలవారీగా సమీక్షించుకోవాలన్నారు. శాశ్వత ప్రాతిపదికన సీసీ కెమెరాలు, సోలార్ సిస్టం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇమాంపేట ప్రభుత్వ భూమిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని, గుడికి సమీపంలోని చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీటి, విద్యుత్ నిరంతరం సరఫరా చేయాలని, టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. జాతరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నందున జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులకు సూచించారు. గుడికి సమీపంలో రహదారుల మరమ్మతులతోపాటు అవసరమైన చోట కొత్తగా నిర్మించాలని చెప్పారు.
గట్టుపైకి వాహనాలు వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధంచేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. గట్టుపైన గెస్ట్‌హౌస్‌లో అన్నివసతులు కల్పించాలన్నారు. రైతులను సంప్రదించిన తరువాతే పార్కింగ్‌కు భూములు చదును చేయాలని, వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. సమావేశంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ పద్మజారాణి, జడ్పీసీఈఓ విజయలక్ష్మి, డీపీఓ యాదయ్య, డీఎం హెచ్ఓ హర్షవర్ధన్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీఎస్పీ మోహన్, మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి, ఆర్అండ్బీ డీఈ మహిపాల్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- బంగారు కమ్మలు కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
- ఎములాడలో దంతెవాడ ఎమ్మెల్యే పూజలు
- శ్రీలంక జలాల్లో మునిగిన భారత ఫిషింగ్ బోట్
- హెచ్-1బీ కోసం ఓపీటీ దుర్వినియోగం: దర్యాప్తుకు అమెరికా సిద్ధం!
- ’అల్లుడు అదుర్స్’ కలెక్షన్లలో వెనకబడిందా..?
- భద్రాద్రి కొత్తగూడెంలో తొలిసారిగా బాలల అదాలత్
- ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- దాహం తీర్చే యంత్రం.... వచ్చేసింది..!
- కామెడీ టచ్‌తో ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్
- ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ప్రకటన