e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home తెలంగాణ నోముల భగత్‌కు సబ్బండవర్గాల మద్దతు: మంత్రి తలసాని

నోముల భగత్‌కు సబ్బండవర్గాల మద్దతు: మంత్రి తలసాని

నోముల భగత్‌కు సబ్బండవర్గాల మద్దతు: మంత్రి తలసాని

హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌కు సబ్బండ వర్గాల మద్దతు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. భగత్‌ విద్యావంతుడని, ఆయన దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు చేదోడువాదోడుగా పనిచేశాడని గుర్తుచేశారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి హాలియాలో మంత్రి మీడియాతో మాట్లారు. ఈ సందర్భంగా.. జానారెడ్డి ఏడుసార్లు మంత్రిగా పనిచేసినప్పటికీ సాగర్‌కు చేసిందేమీ లేదని విమర్శించారు. చెప్పుకునేది ఏమీలేకపోవడంతోనే ప్రచారం వద్దంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సాగర్‌ అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఇందులో భాగంగానే హాలియా మున్సిపాలిటీకి ప్రభుత్వం రూ.కోటి విడుదల చేసిందని వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరివ్వాలని సీఎం కేసీఆర్‌ కొత్త లిఫ్టులను మంజూరు చేశారని తెలిపారు. అన్ని వర్గాల ఆదాయం పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. పల్లెప్రగతితో గ్రామాలు అందంగా మారాయని వెల్లడించారు. రైతుబీమా, రైతుబంధు పథకాలతో నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమచేస్తున్నామని చెప్పారు. కల్యాణలక్ష్మి ద్వారా ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.లక్షా 116 ఇస్తున్నామని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా ఒక సంక్షేమ పథకాన్ని ఆపలేదని చెప్పారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి మద్దుతివ్వాలని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 3479 పోస్టులు
పాకిస్తాన్‌లో క‌రోనా టీకాలు దొంగ‌త‌నం
మ‌మ‌తా బెన‌ర్జీ 66 ఏళ్ల ఆంటీ..
ర‌జ‌నీ‌కి దాదా సాహెబ్ అవార్డు.. క‌మ‌ల్‌హాస‌న్ రియాక్ష‌న్ ఇదీ
ర‌జనీకాంత్‌కు 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్
కోటిన్న‌ర క‌రోనా వ్యాక్సిన్ డోసులు వృథా
అధికార పార్టీలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి
ఎన్‌ఎండీసీలో 224 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు
స‌చిన్ త్వ‌ర‌గా కోలుకోవాలి.. అక్త‌ర్ ట్వీట్‌పై ట్రోలింగ్‌
Advertisement
నోముల భగత్‌కు సబ్బండవర్గాల మద్దతు: మంత్రి తలసాని
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement