శనివారం 06 మార్చి 2021
Telangana - Dec 04, 2020 , 03:43:44

ఊటీకి దీటుగా అలీసాగర్‌

ఊటీకి దీటుగా అలీసాగర్‌

  • టీఎస్‌టీడీసీ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: నిజామాబాద్‌ జిల్లాలోని అలీసాగర్‌ ఉద్యానవనాన్ని ఊటీ, కొడైకెనాల్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని తెలంగాణ స్టేట్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీఎస్‌టీడీసీ) చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తెలిపారు. టీఎస్‌టీడీసీ చైర్మన్‌గా శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదట అలీసాగర్‌ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని టీఎస్‌టీడీసీ కార్యాలయంలో అలీసాగర్‌ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. నిజామాబాద్‌ నగరానికి 15  కిలోమీటర్ల దూరంలో ఉన్న అలీసాగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గుట్టపైకి వెళ్లే రోడ్డు విస్తరణతోపాటు, రోడ్డుకు ఇరువైపుల స్టీల్‌ రెయిలింగ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెరువు మధ్యలోని ప్రాంతాన్ని (ఐలాండ్‌ను) అభివృద్ధి చేస్తామని, గుట్టపైకి రోప్‌వేను  ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. పర్యాటకులకు వినోదం కలిగించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రూయిజ్‌, స్పీడ్‌ బోట్లు, ల్యాండ్‌ స్కేపింగ్‌, వ్యూపాయింట్‌, సెల్ఫీపాయింట్‌ల నిర్మాణాన్ని  త్వరితగతిన పూర్తిచేస్తామని తెలిపారు. హరితహోటల్‌ ద్వారా నార్త్‌ , సౌత్‌ ఇండియా ఫుడ్‌ అందించే ఏర్పాట్లు చేయనున్నామని వివరించారు.

VIDEOS

logo