ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 01:54:17

పెద్దతూప్రలో మద్యనిషేధం

పెద్దతూప్రలో మద్యనిషేధం

  • తాగినా, అమ్మినా జరిమానా
  • గ్రామస్థుల ఏకగ్రీవ తీర్మానం

శంషాబాద్‌ రూరల్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పెద్దతూప్ర గ్రామంలో బుధవారం నుంచి మద్యనిషేధం అమలుకానున్నది. గ్రామంలో మద్యం అమ్మితే రూ.50 వేలు.. తాగితే రూ. 5 వేలు జరిమానా విధించాలని గ్రామస్థులు తీర్మానించారు. గ్రామంలో నాలుగు బెల్టుషాపులు కొనసాగేవి. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు విచ్చలవిడిగా మద్యం తాగుతూ చెడిపోయారు. ఈ క్రమంలో కుటుంబాల్లో గొడవలు చెలరేగేవి. దీన్ని గమనించిన సర్పంచ్‌ చిటికెల వెంకటయ్య ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తున్నామని సర్పంచ్‌ చిటికెల వెంకటయ్య తెలిపారు. గ్రామానికి చెందిన మహిళ దిద్యాల పార్వతమ్మ మట్లాడుతూ.. మద్యం కారణంగా యువకులు, పెద్దలూ తాగి ఊగుతూ సంసారాలు పాడుచేసుకుంటున్నారని, అందుకే ఊళ్లో మద్యం అమ్మటాన్ని బంద్‌ చేయాలని చెప్పామని పేర్కొన్నారు. ఏది ఏమైనా గ్రామంలో మద్యనిషేధంపై నిర్ణయం తీసుకోవటాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.