బుధవారం 27 మే 2020
Telangana - May 23, 2020 , 22:59:29

మద్యం మత్తులో తల్లిని కొట్టబోయి..

మద్యం మత్తులో తల్లిని కొట్టబోయి..

మానకొండూర్‌  : మద్యం మత్తులో తల్లిని కొట్టబోయేందుకు ప్రయత్నించగా తండ్రి అడ్డుగా వెళ్లడం.. ఇద్దరి మధ్య జరిగిన తోపులాటలో కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం చెంజర్ల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన జంగ నారాయణ, లక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు. రెండో కొడుకు జంగ లక్ష్మణ్‌(25) గంగాధరలో హార్వెస్టర్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. 

శనివారం మద్యం తాగి ఇంటికి వచ్చిన లక్ష్మణ్‌ అదే మత్తులో తల్లిని కొట్టేందుకు ప్రయత్నించాడు. తండ్రి అడ్డుకోబోగా తోపులాట జరిగి లక్ష్మణ్‌ కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్‌ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోష్‌ కుమార్‌ తెలిపారు.


logo