శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 20:08:29

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను స్వీకరించిన అక్కినేని సమంత

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను స్వీకరించిన అక్కినేని సమంత

హైదరాబాద్‌ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌కుమార్  స్వీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తి దాయకంగా సాగుతోంది. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతోపాటు అన్నివర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ సామాజిక బాధ్యత చాటుతున్నారు. గతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కోడలు సమంతకు ఛాలెంజ్ విసిరారు. దీన్ని స్వీకరించిన ఆమె శనివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సమంత మాట్లాడుతూ.. ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌ కుమార్ చాలా గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారని, కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని కోరారు. ఒక్కొక్కరు కనీసం మూడు మొక్కలు నాటాలని తన అభిమానులకు ఆమె  పిలుపునిచ్చింది. తన సహానటులు కీర్తి సురేశ్‌, రష్మీక మందాన్నకు ఛాలెంజ్ విసిరింది. 



logo