శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 20, 2020 , 02:11:22

మర్కూక్‌కు చేరిన గోదారమ్మ

మర్కూక్‌కు చేరిన గోదారమ్మ

  • అక్కారం ఒకటో మోటర్‌ వెట్ రన్‌‌ విజయవంతం
  • కొండపోచమ్మసాగర్‌లోకి ఎత్తిపోయడమే తరువాయి
  • రెండు, మూడురోజుల్లో మర్కూక్‌లో డ్రైరన్‌, వెట్న్‌

గజ్వేల్‌: కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతల ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం అక్కారం పంప్‌హౌజ్‌లో ఒకటో నంబర్‌ మోటర్‌ వెట్న్‌ మంగళవారం సాయంత్రం విజయవంతమైంది. రెండురోజులుగా వెట్న్‌ కోసం నిపుణులు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో సాయంత్రం 5.30 గంటలకు కాళేశ్వర గంగ ఎగిసిపడి మర్కూక్‌ వైపు పరుగులు తీసింది. అక్కారం పంప్‌హౌజ్‌లో 27 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు మోటర్లు ఉండగా, మొదటి మోటర్‌ వెట్న్‌ విజయవంతమైంది. రెండురోజుల్లో రెండు, మూడో నంబర్‌ మోటర్ల వెట్న్‌క్రు ఏర్పాట్లుచేస్తున్నారు. అక్కారం నుంచి 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపోచమ్మసాగర్‌ సమీపంలోని మర్కూక్‌ పంప్‌హౌజ్‌కు జలాలు చేరుకున్నాయి. మర్కూక్‌లో 34 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు మోటర్లు ఉన్నాయి. ముందుగా మోటర్ల డ్రైరన్‌ నిర్వహించిన తర్వాత గోదావరి జలాలను పంప్‌హౌజ్‌లోకి వదిలి లీకేజీలను పరీక్షించి వెట్న్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు, మూడురోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి ఏర్పాట్లుచేస్తున్నారు. మర్కూక్‌ పంప్‌హౌజ్‌లో ఎత్తిపోసిన కాళేశ్వర జలాలు కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి చేరుకోనున్నాయి. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా జరుగనున్నది. ప్రాజెక్టు అధికారులు ఇందుకు అవసరమైన ఏర్పాట్లుచేస్తున్నారు. అక్కారం నుంచి పలు గ్రామాల మీదుగా మర్కూక్‌కు గోదావరి జలాలు చేరుకోవడాన్ని ఆసక్తిగా తిలకించిన ప్రజలు సంబురాల్లో మునిగిపోయారు. అక్కారం మోటర్‌ వెట్న్‌ విజయవంతం పట్ల ఈఎన్సీ హరిరాం సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో కాళేశ్వరం ఎస్‌ఈ వేణు, ఈఈ బద్రీనాథ్‌, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo