ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ

హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పోలీస్ కస్టడీ బుధవారంతో ముగిసింది. మూడు రోజుల విచారణలో అఖిలప్రియ నుంచి కిడ్నాప్‌కు సంబంధించిన పలు విషయాలను పోలీసులు రాబట్టారు. పోలీసులు సంధించిన 300లకుపైగా ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పినట్లు తెలిసింది. కిడ్నాప్ ప్లాన్ వివరాలన్నీ పోలీసులకు అఖిలప్రియ పూసగుచ్చినట్టు చెప్పిందని సమాచారం. విచారణలో అఖిలప్రియ చెప్పిన సమాచారంతో కేసులో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. యూసుఫ్‌గూడ, ఎంజీఎం స్కూల్, కూకట్పల్లి హోటళ్లలో పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎంజీఎం స్కూల్లో కిడ్నాపర్లతో భార్గవ్, చంద్రహాస్ భేటీ అయ్యారు. కూకట్‌పల్లిలోని ఓ హోటల్లో మాదాల శ్రీనుతో భేటీ భార్గవ్ భేటీ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎంజీఎం స్కూల్లో సినిమా చూపించి కిడ్నాప్‌కు భార్గవ్ స్కేచ్ వేసినట్లు వెల్లడించారు. కిడ్నాప్ సమయంలో బోయిన్పల్లి వరకు భార్గవ్ కారులో వెళ్లినట్లు సాక్షాలున్నాయని పేర్కొన్నారు. కిడ్నాప్ తరువాత భార్గవ్ మొయినాద్ ఫామ్‌హౌస్‌కు వెళ్లాడని తెలిపారు. భార్గవ్‌రామ్, చంద్రహాస్, మాదాల శ్రీను సహా కేసులో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సింధు నిష్క్రమణ
- వంద రోజుల్లో వెయ్యి కంటి శస్త్రచికిత్సలు
- అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం
- వుయ్ షుడ్ నెవర్ వేస్ట్ గుడ్ క్రైసిస్: హీరో చైర్మన్
- ‘ఈడబ్ల్యూసీ’తో అగ్రవర్ణ పేదలకు న్యాయం : కేటీఆర్
- ఎనీ బుక్ @ ఇంటర్నెట్
- కార్పొరేట్‌కు దీటుగా నేత కార్మికులు ఎదగాలి
- గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
- ‘పల్లె ప్రగతి’తో సత్ఫలితాలు
- కొత్త హంగులతో కోట