శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:20:57

మీరు ఓటేస్తే అంతర్జాతీయ అవార్డు!

మీరు ఓటేస్తే అంతర్జాతీయ అవార్డు!

  • గ్లోబల్‌ ఆర్ట్‌ అవార్డ్‌ చేరువలో సూక్ష్మశిల్పి అజయ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్లోబల్‌ ఆర్ట్‌ అవార్డు 2020 పోటీల్లో తెలంగాణ బిడ్డ, వరంగల్‌కు చెందిన సూక్ష్మ శిల్పి అజయ్‌కుమార్‌ స్వల్ప ఓట్లతేడాతో రెండోస్థానంలో కొ నసాగుతున్నారు. నెటిజన్లు మద్దతిచ్చి అండ గా నిలిస్తే అవార్డును దక్కించుకోవడం ఖా యమని జలవనరుల మండలి చైర్మన్‌ వీ ప్రకాశ్‌ అన్నారు. ఏటా గ్లోబల్‌ ఆర్ట్‌ అవార్డు పోటీలను సూక్ష శిల్పకళ, పెయింటింగ్‌, ఫొటోగ్రఫీ, త్రీడీ టెక్నాలజీ తదితర కేటగిరీల్లో నిర్వహిస్తుంటారు. ఈసారి చైనా అతిథ్యమిస్తున్న ఈ పోటీల్లో సూక్ష్మ శిల్పకళా విభాగంలో వరంగల్‌కు చెందిన మట్టెవాడ అజయ్‌కుమార్‌ సూది బెజ్జంలో మూవీ మే కింగ్‌ శిల్పాలను తీర్చిదిద్ది పోటీకి పంపారు. ఆన్‌లైన్‌ ఓటింగ్‌లో సుమారు 9,179 మంది అజయ్‌కు మద్దతుగా నిలిచారు.  

బెల్జియంకు చెందిన కళాకారుడు 9,400 ఓట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. గురువారం అర్ధరాత్రితో ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ప్రక్రియ ముగిసిపోనున్న నేపథ్యంలో మన కళాకారుడికి అండగా నిలవాలని.. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. తనకు మద్దతుగా ఓటేయాలని కళాకారుడు అజయ్‌కుమార్‌ విజ్ఞప్తిచేశారు. ఆన్‌లైన్‌ ఓటిం గ్‌ ద్వారా విజేతలను ఈ నెల 21న ప్రకటిస్తారు. ఓటువేసేవారు https://1.shor tstack.com/3S0wmS/rr1b0?we=82977539-257345552I లింకును ఓపెన్‌ చేసి క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.