సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 01:52:45

అజయ్‌మిశ్రా సహకారం మరువలేం

అజయ్‌మిశ్రా సహకారం మరువలేం

  • ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ప్రశంస
  • ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌కు ఘనంగా వీడ్కోలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ సాధించిన అద్భుతమైన విజయాల్లో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్‌మిశ్రా సహకారం ఎంతో ఉన్నదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. ప్రభుత్వానికి, విద్యుత్‌ సంస్థలకు మధ్య వారధిగా పనిచేశారని కొనియాడారు. పదవీ విరమణచేసిన అజయ్‌మిశ్రాకు శనివారం ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో విద్యుత్‌సౌధలో ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


logo