గురువారం 09 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 09:24:50

హైదరాబాద్‌లో ఇంటికే సిమ్‌ కార్డులు

హైదరాబాద్‌లో  ఇంటికే సిమ్‌ కార్డులు

 హైదరాబాద్: ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటిలోనే ప్రజలను ఉంచడాన్ని ప్రోత్సహించడంలో భాగంగా సిమ్‌లను ఇంటి వద్దకే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వినూత్న సేవలను హైదరాబాద్‌లో ఆరంభించింది సంస్థ. ఇక్కడ అత్యధిక రిటైల్‌ అవుట్‌లెట్లు తెరుచుకున్నప్పటికీ, కాంటాక్ట్‌లెస్‌ డెలివరీ సేవల్లో భాగంగా వినియోగదారుడికి సిమ్‌ కార్డును ఇంటి వద్దకే అందిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.  

బ్రాడ్‌బ్యాండ్‌ డీటీహెచ్‌, తదితర సేవలను కూడా ఇంటి నుంచే పొందవచ్చని కంపెనీ పేర్కొంది.   కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. 


logo