శనివారం 11 జూలై 2020
Telangana - May 25, 2020 , 13:31:30

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్‌

హైదరాబాద్‌: సుమారు రెండు నెలల తర్వాత శంషాబాద్‌ విమానాశ్రయంలో దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో విమానాశ్రయంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పరిశీలించారు. ప్రయాణికుల ఆరోగ్యంపై ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. మిమానాశ్రయంలో టచింగ్‌ పాయింట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ రోజు ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్‌కు 19 విమనాలు వస్తాయని, మరో 19 విమనాలు హైదరాబాద్‌ నుంచి ఇతర రాష్ర్టాలకు వెళ్తాయని చెప్పారు. రేపటి నుంచి మరిన్ని విమానాలు తిరుగుతాయన్నారు. 

ఇవాళ 16 వందల మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు వస్తున్నారని చెప్పారు. ప్రతి ప్రయాణికుడి దగ్గర ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరని, కరోనా లక్షణాలు కనిపిస్తే అన్ని రకాల పరీక్షలు చేస్తామన్నారు. కరోనా లక్షణాలు లేనివారికి 14 రోజుల క్వారంటైన్‌ అవసరం లేదని వెల్లడించారు.  ప్రతి ప్రయాణికుడు ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ సూచనలు పాటించాలని తెలిపారు.


logo