హైదరాబాద్, జూన్ 7, (నమస్తే తెలంగాణ): దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న అండర్ ట్రైనీలు, ఫ్లైట్ క్యాడెట్స్‌కు నిర్వహించే ఇంటర్ స్కాడ్రన్ డ్రిల్ పోటీలు సోమవారం ముగిశాయి. స్కాడ్రన్ డ్రిల్ పోటీలతోపాటు క్రీడలు, క్విజ్, చర్చలు ఇతర విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన బృందానికి ఇచ్చే కమాండెంట్స్ బ్యానర్-2021 ట్రోఫీ ఈసారి బీఆర్ఏఆర్ స్కాడ్రన్ దక్కించుకొంది. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎయిర్ మార్షల్ ఐపీ విపిన్ మాట్లాడుతూ.. శారీరక దృఢత్వంతోనే మానసికంగానూ శక్తిమంతంగా తయారవుతారని, మిలిటరీ వాళ్ల జీవితంలో అది ఎంతో కీలకమైనదని అన్నారు. ఫ్లైట్ క్యాడెట్లుగా తమనుతాము మలుచుకొనేందుకు ట్రైనీ అధికారులు చేస్తున్న శ్రమ అభినందనీయమని పేర్కొన్నారు.