బుధవారం 03 జూన్ 2020
Telangana - May 10, 2020 , 01:48:56

కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు 163 మంది

కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు 163 మంది

వైరస్‌ లక్షణాలు లేనివారు పెయిడ్‌ క్వారంటైన్‌కు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో కువైట్‌ నుంచి ప్రత్యేక విమానంలో 163 మంది శనివారం రాత్రి 10.30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి వైద్య విభాగాలు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాయి. కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు స్వల్పంగా ఉన్నవారిని ఐసొలేషన్‌ కేంద్రాలకు, ఏమాత్రం లక్షణాలు లేనివారిని నగర శివార్లలోని హోటళ్లు, రిసార్ట్స్‌లలో ఏర్పాటుచేసిన పెయిడ్‌ క్వారంటైన్లకు తరలించారు. కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతించలేదు. విదేశాల నుంచి వచ్చేవారు 14 రోజులు హోటల్‌ క్వారంటైన్‌లో, మరో 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యశాఖ అధికారులు నిర్ణయించారు. పెయిడ్‌ క్వారంటైన్లలో రెండురకాల ప్యాకేజీలు ఉన్నాయి. అందులో ఒకటి రూ.15 వేలు, మరొకటి రూ.30 వేలు. వీటిల్లో వైఫై సౌకర్యం కూడా కల్పించారు. ఈ నెల 17వ తేదీ వరకు విదేశాల నుంచి సుమారు 2 వేల మంది రానున్నారు.logo