గురువారం 28 మే 2020
Telangana - May 17, 2020 , 12:53:29

చికాగో నుంచి హైదరాబాద్‌ వచ్చిన విమానం

చికాగో నుంచి హైదరాబాద్‌ వచ్చిన విమానం

హైదరాబాద్‌: వందే భారత్‌ మిషన్‌లో భాగంగా 126 మంది భారతీయులతో చికాగో నుంచి వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం హైదరాబాద్‌లో దిగింది. ఈ విమానం ఢిల్లీ మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చింది. లాక్‌డౌన్‌తో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం మే 7న వందే భారత్‌ మిషన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా మే 16న 121 మందితో అమెరికాలోని న్యూవర్క్‌ నుంచి ఎయిర్‌ ఇండియా విమానం వచ్చింది.

రెండో విడత వందే భారత్‌ మిషన్‌లో భాగంగా సుమారు 31 దేశాల్లో ఉన్న సుమారు 30 వేల మంది భారతీయులను 149 ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకురానున్నారు. మొదటి విడత వందే భారత్‌ కార్యక్రమంలో 14,800 మంది భారతీయులకు 64 ప్రత్యేక విమానాల్లో తరలించారు.


logo