Telangana
- Dec 31, 2020 , 20:09:49
ఎయిమ్స్ విద్యార్థులు వైద్య రంగంలో రాణించాలి

యాదాద్రి భువనగిరి/బీబీనగర్ : ఎయిమ్స్‌లో విద్యనభ్యసిస్తున్న ఎంబీబీఎస్ విద్యార్థులు వైద్య రంగంలో రాణించి దేశానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. బీబీనగర్ మండల పరిధిలోని ఎయిమ్స్‌లో గురువారం 2020-21 మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధిగా కలెక్టర్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎయిమ్స్‌లో మౌలిక సదుపాయల కల్పనలో తమ వంతు సహాయసహకారాలను అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ వికాస్ భాటియా, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
తాజావార్తలు
MOST READ
TRENDING