బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 13:42:15

ఎల్ల‌మ్మ‌గుట్ట‌పై 10 వేల మొక్క‌లు నాట‌డ‌మే ల‌క్ష్యం : ఎమ్మెల్యే ఆల్ల‌ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి

ఎల్ల‌మ్మ‌గుట్ట‌పై 10 వేల మొక్క‌లు నాట‌డ‌మే ల‌క్ష్యం : ఎమ్మెల్యే ఆల్ల‌ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : దేవ‌ర‌క‌ద్ర ఎమ్మెల్యే ఆల్ల‌ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటారు. మంత్రి నిరంజ‌న్‌రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీక‌రించిన‌ ఎమ్మెల్యే భూత్పూర్ మండ‌లం అన్న‌సాగ‌ర్ గ్రామంలోని ఎల్ల‌మ్మగుట్ట వ‌ద్ద నేడు మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ఎంపీ సంతోష్ కుమార్ శ్రీ‌కారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో త‌న‌ను భాగ‌స్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం యావ‌త్ దేశం మొత్తం ప్రాచుర్యం పొందింద‌న్నారు. నాటిన మొక్క‌ల‌ను వంద‌కు వంద శాతం బ్ర‌తికించుకోవాల‌న్నారు. 

ఎల్లమ్మ గుట్ట దగ్గర 10 వేల‌ మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ క్ర‌మంలో భాగంగా ఈ రోజు 2 వేల మొక్కలను నాటడం జరిగింద‌న్నారు. వారం రోజుల్లో మొత్తం 10 వేల మొక్కలు నాటనున్న‌ట్లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మ‌రో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు. జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, భూత్పూర్ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి కి గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు. 


logo