శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 31, 2020 , 00:49:22

అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యం

అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యం

  • ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

మహబూబ్‌నగర్‌: నిరుపేదలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి అందరినీ సమానంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని బాలుర జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం క్లాక్‌టవర్‌ వద్ద జంక్షన్‌ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొక్కలు సృష్టికి మూలమని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం పలు షాపులను సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు. 


logo