గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 21, 2020 , 05:54:19

రేపటి నుంచి వ్యవసాయ వర్సిటీలో అగ్రిటెక్‌ సౌత్‌

రేపటి నుంచి వ్యవసాయ వర్సిటీలో అగ్రిటెక్‌ సౌత్‌

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శనివారం (ఈ నెల 22) నుంచి 24 వరకు అగ్రిటెక్‌ సౌత్‌-2020, అగ్రివిజన్‌-2020 ప్రదర్శన, సదస్సు జరగనున్నాయి. పీజీటీఎస్‌ఏయూ, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్న సదస్సు, ప్రదర్శనలను శనివారం ఉదయం 10 గంటలకు వర్సిటీ ఆడిటోరియంలో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ ఏపీసీ బీ జనార్దన్‌రెడ్డి, వర్సిటీ వీసీ  డాక్టర్‌ వీ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా వ్యవసాయరంగంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, ఇంటెలిజెంట్‌ అగ్రికల్చర్‌, రోబోటిక్స్‌, ఫార్మ్‌మెషినరీ, వాతావరణ మార్పులు, నేల, నీటి సమర్థ యాజమాన్యం, పశుపోషణ, హార్టికల్చర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పోస్ట్‌హార్వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతుల విజయగాథలు తదితరాలపై చర్చిస్తారు. వివిధరంగాల నిపుణులు, భారతీయ వ్యవవసాయ పరిశోధన మండలి వివిధ విభాగాల శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, రైతులు పాల్గొననున్నారు. 


logo