ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 19:52:59

మంజీరా నదిలో వ్యవసాయాధికారి గల్లంతు.!

మంజీరా నదిలో వ్యవసాయాధికారి గల్లంతు.!

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలో వ్యవసాయాధికారి మంజీరా నదిలో గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలివి.. నారాయణఖేడ్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన అరుణ సంగారెడ్డి రైతు శిక్షణ కేంద్రంలో వ్యవసాయాధికారిగా పనిచేస్తోంది. గురువారం ఉదయం కారులో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతకగా మానూరు మండలం రావిపల్లి వద్ద మంజీరా నది బ్రిడ్జిపై కారు కనిపించింది.

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కారును తనిఖీ చేయగా అందులో ఆమె సెల్‌ఫోన్, పర్సు, కారు తాళంచెవి ఉన్నాయి. అరుణ నదిలో గల్లంతైనట్లు కుటుంబీకులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహం కోసం గాలిస్తున్నారు. అరుణ నదిలోకి వెళ్లినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడం, సెల్‌ఫోన్‌ సైతం కారులోనే వదిలేయడంతో ఆచూకీ తెలుసుకోవడం పోలీసులకు సవాలుగా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.