మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 01:04:30

వారంలో యాసంగి పంట వివరాలు

వారంలో యాసంగి పంట వివరాలు
  • మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతులు యాసంగిలో ఏయేపంటలు సాగుచేశారో వారంలో నివేదిక ఇవ్వాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హాకాభవన్‌లో నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన  మంత్రులు ఈటల, అల్లోల  ఇంద్రకరణ్‌రెడ్డి, విత్తనాభివృద్ద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు, విత్తనోత్పత్తి సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారు లు సమావేశమయ్యారు. ఈ ఏడాది యాసంగిలో రైతులు  38.19 లక్షల ఎకరాల్లో వరిపంటను సాగుచేశారని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. 
logo