గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Aug 03, 2020 , 00:11:15

వందేండ్ల ముందుచూపుతో కేసీఆర్‌ పాలన

వందేండ్ల ముందుచూపుతో కేసీఆర్‌ పాలన

  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • ఎంజీకేఎల్‌ఐ లిఫ్ట్‌-3 నుంచి నీటి విడుదల

నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ/కల్వకుర్తి: వందేండ్ల ముందుచూపుతో సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని, ఆరేండ్లలోనే రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా గుడిపల్లి వద్ద ఎంజీకేఎల్‌ఐ లిఫ్ట్‌-3లో రిజర్వాయర్‌కు భారీగా వరద రాగా.. 29, 30వ ప్యాకేజీలకు విప్‌ గువ్వల బాలరాజు, జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రెండు ప్యాకేజీల ద్వారా విడుదలైన నీరు నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాల ఆయకట్టుకు అందుతుందన్నారు. ‘పాలమూరు-రంగారెడ్డి’ పనులు 70 శాతం పూర్తయ్యాయని.. ఏదుల, వట్టెం రిజర్వాయర్ల పనులు 90 శాతం చేపట్టినట్లు పేర్కొన్నారు. వచ్చే వానకాలం నాటికి తొలి విడతగా సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. అనంతరం కల్వకుర్తిలో రైతువేదిక నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు.


logo