ఎద్దును ముద్దాడిన వ్యవసాయ శాఖ మంత్రి

జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని స్వయంభు లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రైతు సంబురాలను రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ర్ట స్థాయి బండ లాగుడు పోటీల సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి.. పోటీలో పాల్గొంటున్న ఓ ఎద్దుకు ముద్దిచ్చి పశువులపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఎద్దుకు మంత్రి ముద్దివ్వడంతో అక్కడున్న అన్నదాతలంతా సంబురపడిపోయారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహంతో పాటు తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు లక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నడిగడ్డలో నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా సుమారు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. సుమారు రూ.600 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకానికి త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పనులు రెండేండ్లలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరు అందిస్తున్నామని చెప్పారు.
తాజావార్తలు
- అంతర్రాష్ట్ర గజదొంగ బాకర్ అలీ అరెస్ట్
- జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రూ.1000 కోట్లు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్