బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 18:48:11

రాజవుతున్న రైతు

రాజవుతున్న రైతు
  • రాష్ట్రంలో వ్యవసాయం అనూహ్య పురోగతి
  • మిగిలిన రంగాల్లోనూ తెలంగాణ జోరు
  • పారిశ్రామిక ఉత్పత్తుల్లో జాతీయ సగటు కంటే ఎంతో మెరుగు
  • సామాజిక ఆర్థిక సర్వే నివేదిక వెల్లడి మురిసినపాడి, పంట
  • సేవలరంగంలో దూసుకెళ్తున్నతెలంగాణ రాష్ట్రం

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ:ఆర్థికమాంద్యాన్ని, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ల లో నెలకొన్న ఒడిదుడుకులను తట్టుకొని తెలంగాణలో దాదాపు అన్నిరంగాలు పురోగమిస్తున్నాయి. వ్యవసాయరంగం అనూహ్యవృద్ధిని సాధిస్తున్నది. పల్లెలు పాడి, పంటలతో మురిసిపోతుండటంతో రైతులు రాజులవుతున్నారు. సేవారంగం దూసుకుపోతున్నది. ఐటీ, రియల్‌ రంగాల్లో తెలంగాణ సంపద అన్నిరాష్ర్టాల కంటే అధికంగా పెరుగుతున్నది. 

మురుస్తున్న పాడి, పంట 

సాగునీటిప్రాజెక్టులు, రైతన్నలకు ఆర్థికసాయం తో వస్తున్న సత్ఫలితాలు ఇప్పుడు కండ్లకుకడుతు న్నాయి. 2019-20ఆర్థికసంవత్సరంలో పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దానికి అనుగుణంగా పంట గిట్టుబాటు కావడంతో రాష్ట్ర సంపద వృద్ధిచెందినట్టు ఆర్థిక, సామాజిక సర్వే నివేదిక వెల్లడించింది. గతేడాది 6.6 శాతంగా ఉన్న వృద్ధిరేటు ఈసారి అమాంతంగా 23.7 శాతానికి పెరిగింది. సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో వ్యవసాయరంగం పుంజుకున్నది. మరోవైపు పశుసంపద (లైవ్‌స్టాక్‌) గణనీయంగా పెరిగింది. లైవ్‌స్టాక్‌లో గతేడాది 15.9శాతంగా ఉన్న వృద్ధిరేటు ఈసారి 17.3 శాతానికి పెరిగింది. అటవీ ఉత్పత్తులు కూడా 3శాతం పెరిగాయి. మైనింగ్‌రంగంలో మాత్రం వృద్ధిరేటు 23.9శాతం నుంచి 1.1 శాతానికి తగ్గింది. మొత్తంగా ప్రాథమికరంగంలో గతేడాది కంటే ఈ ఏడాది 2.6 శాతం అధిక వృద్ధిరేటు నమోదైంది. ఇదే సమయంలో ప్రాథమికరంగంలో జాతీయ సగటు వృద్ధిరేటు 10.1 శాతంగా ఉన్నది. దీనితో పోలిస్తే తెలంగాణలో ప్రాథమికరంగం వృద్ధిరేటు 4 శాతం ఎక్కువ.


పారిశ్రామిక ఉత్పత్తులు తగ్గినా..

రాష్ట్రంలో ఈసారి ద్వితీయరంగం క్షీణించింది. ఆ ర్థికమాంద్యం, ఇతర ప్రతికూల ప్రభావాల వల్ల పారిశ్రామిక ఉత్పత్తుల వృద్ధిరేటు 3.5శాతానికి క్షీణించింది. ఇదేసమయంలో జాతీయ సగటు వృద్ధిరేటు 1.7శాతానికి పడిపోయింది. కానీ రా ష్ట్రంలో విద్యుత్‌, గ్యాస్‌, నీటిసరఫరారంగాలు కాస్త మెరుగుపడ్డాయి. గతేడాది 17.3 శాతంగా ఉన్న వృద్ధిరేటు ఈసారి 17.5 శాతానికి పెరిగింది. ఐటీ, రియల్‌ ఎస్టేట్‌, రవాణా, విమానయాన, హోటళ్లు, రెస్టారెంట్‌ సర్వీసులు గతేడాది మాదిరిగానే ఈసారి కూడా 14.1 శాతం వృద్ధిరేటును సాధించడం విశేషం. ఇదే సమయంలో జాతీయ సగటు వృద్ధిరేటు 9.6 శాతానికి పరిమితమైంది.

రాష్ట్ర సంపదను ఎలా లెక్కిస్తారంటే..

రాష్ట్రమొత్తం సంపదను ప్రాథమిక, ద్వితీయ, సేవా (టర్టియరీ) రంగాలుగా విభజించి ప్రస్తుత ధరల వద్ద, 2011 నాటి స్థిర ధరల వద్ద రెండు రకాలుగా లెక్కిస్తారు. ప్రాథమికరంగంలో వ్యవసాయం దానికి అనుబంధ రంగాలు, ద్వితీయరంగంలో పరిశ్రమలు, విద్యుత్‌, నిర్మాణ, నీటిసరఫ రా లాంటివి ఉంటాయి. ఐటీ, కమ్యూనికేషన్స్‌, హోటళ్లు, రెస్టారెంట్లు, స్థిరాస్తి క్రయవిక్రయాలు, ప్రజారవాణా, ఆర్థికసేవలు. సాధారణ పరిపాలన సేవారంగం కిందికొస్తాయి. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను జీవీఏ నుంచి తీసేసిన తర్వాత వచ్చి న మొత్తానికి ప్రభుత్వ రాబడులను, ఆదాయాన్ని కలిపి రాష్ట్ర సంపద (జీఎస్డీపీ)ను లెక్కగడతారు. ఈ లెక్కన 2019-20లో రాష్ట్రసంపద 12.6 శా తంమేరకు వృద్ధిచెంది ప్రస్తుత ధరలవద్ద రూ. 9,69,604 కోట్లకు పెరిగిందని,  దేశసంపద  7.5శాతం వృద్ధిరేటుతో రూ.2,03,84,759 కోట్లుగా ఉన్నదని సర్వే వెల్లడించింది.

సంపద సృష్టికి భారీగా పెట్టుబడి

పెట్టుబడి వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం 2020-21 వార్షిక బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు జరిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.17,274 కోట్లుగా ఉన్న ఈ కేటాయింపులను ఈసారి రూ.22,061 కోట్లకు పెంచింది. ఓవైపు సొంత రాబడులను పెంచుకొంటూ మరోవైపు భవిష్యత్‌లో రాష్ట్ర సంపదను మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభు త్వం నిర్ధిష్ఠ చర్యలు చేపడుతున్నది. రెవెన్యూ ఖర్చులతోపాటు పెట్టుబడి వ్యయానికి కూడా పెద్దపీట వేస్తూ భవిష్యత్‌ తరాలకు స్థిరమైన రాబడి అందించేందుకు దూరదృష్టితో వ్యవహరిస్తున్నది. భవిష్యత్‌ అవసరాలకు ఎలాం టి అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాలనే విషయంపై పక్కా ప్రణాళికతో నిధులు కేటాయిస్తున్నది. ప్రాజెక్టులు, రవాణా, ఖనిజాభివృద్ధి లాంటి రంగాలకు చేసే ఖర్చులను పెట్టుబడి వ్యయంగా చూపుతారు. ఉమ్మ డి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు పెట్టుబడి వ్యయానికి కేవలం రూ.59 వేల కోట్లు వెచ్చించగా..  తెలంగాణలో ఐదేండ్లలోనే రూ.1.60 లక్షల కోట్లకుపైగా ఖర్చుచేసి దేశంలోనే అగ్రభాగాన నిలిచింది.

రాష్ట్ర సంపదలో వివిధ రంగాల వాటా శాతం (ప్రస్తుత ధరల వద్ద)


రంగాల వారీగా వృద్ధిరేటు 
logo