మంగళవారం 26 మే 2020
Telangana - May 22, 2020 , 19:47:14

మెరిట్‌ ఆధారంగానే ఏఈవోల నియామకం

మెరిట్‌ ఆధారంగానే ఏఈవోల నియామకం

హైదరాబాద్‌: సమగ్ర వ్యవసాయ విధానం అమలుకోసం క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) కొరత లేకుండా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా 194 మంది ఏఈవోలను తాత్కాలిక ప్రాతిపదికన నియమించునున్నామని చెప్పారు. ఈ నియామకాలన్నీ పూర్తిగా మెరిట్‌ ఆధారంగానే చేపడతామని వెల్లడించారు. ఉద్యోగుల ఎంపిక బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించామన్నారు. అభ్యర్థుల ఎంపికలో మార్కుల మెరిట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రాతిపదికనే చేపడతామని చెప్పారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ విషయంలో అపోహలు పెట్టుకోవద్దని, ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఆయన సూచించారు.


logo