బుధవారం 03 జూన్ 2020
Telangana - May 19, 2020 , 23:07:44

బూరుగు చెట్టును చూసి పంటల సాగు

బూరుగు చెట్టును చూసి పంటల సాగు

కరీంనగర్‌ :  కార్తిల లెక్కనో.. లేక తేదీల లెక్కనో రైతులు పంట సాగు చేయడం సర్వసాధారణం. కానీ, కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం చెర్లపల్లి(ఆర్‌) ఊరిలో మాత్రం చెట్టు చిగురించిన సమయాన్ని బట్టి సాగు చేస్తూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద 200 ఏళ్ల నాటి బూరుగు చెట్టు ఉన్నది. దీనికి ఆకులు చిగురించి ముదురు రంగుకు చేరుకున్న తర్వాతనే ఈ గ్రామంలో రోహిణీ కార్తి పంటలు సాగు చేయడానికి రైతులు సిద్ధమవుతారు. తాతల కాలం నుండి ఇది ఆచారంగా వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. చెట్టు ఆకులు ముదురు రంగులోకి వచ్చిన తర్వాతనే రోహిణీ కాన్తి పంటలు సాగు చేయడం ప్రారంభింస్తారని రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ పుల్కం గంగన్న తెలిపారు.logo