ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 00:47:23

సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధికి నిదర్శనం

సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధికి నిదర్శనం

  • కరోనా వేళ రైతుబంధు నిధులు విడుదల హర్షణీయం
  • ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు: మంత్రి సింగిరెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా విపత్తు నేపథ్యంలో దేశమంతా ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సీఎం కేసీఆర్‌ అన్నదాతలకు రైతుబంధు నిధులు విడుదల చేయడం హర్షణీయమని, సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధికి ఇదే నిదర్శమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. రైతుబంధు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి సోమవారం ఓ ప్రకటనలో ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వానకాలం పెట్టుబడి కోసం ఇప్పటికే రూ. 5,500 కోట్లు వ్యవసాయశాఖకు బదిలీచేశారని, విడుదలకు మరో రూ.1,500 కోట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వ్యవసాయరంగానికి రూ. 7 వేల కోట్లు కేటాయించడం ముఖ్యమంత్రికి సాగుపై ఉన్న మక్కువకు నిదర్శమని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నదని కొనియాడారు. సీఎం కేసీఆర్‌ సాగునీరు, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు భారీగా నిధులు ఖర్చు చేస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి ఆలోచనలు, విజన్‌ కారణంగా ఆరేండ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మారిపోయిందని, నియంత్రిత సాగుతో మరింత మేలు జరుగనుందని పేర్కొన్నారు. logo